దరఖాస్తులో తప్పులు సరిచేసుకుంటేనే అకౌంట్లోకి రూ.6వేలు

దరఖాస్తులో తప్పులు సరిచేసుకుంటేనే అకౌంట్లోకి రూ.6వేలు

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకంటే వీరి దరఖాస్తు విధానంలో తప్పులు ఉండటంతో డబ్బులు రావడం లేదు. అయితే వీరి పేరుపై డబ్బులు మంజూరై ఉన్నాయి కానీ వీరు తప్పులు సరిదిద్దుకుంటేనే ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు అధికారులు.