అల్వాల్, వెలుగు: ఓ మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. సదరు మహిళ కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మచ్చ బొల్లారంలో నివాసముండే ఓ మహిళ భర్తకు దూరంగా ఉంటూ 15 సంవత్సరాల కూతురుతో నివసిస్తోంది. దుర్గాప్రసాద్(34) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఈ క్రమంలో దుర్గాప్రసాద్ సదరు మహిళ కూతురుపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
