ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో బుమ్రా నెంబర్ 1

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో బుమ్రా నెంబర్ 1

దుబాయ్‌‌‌‌: ఇండియా స్పీడ్‌‌స్టర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో మళ్లీ నంబర్‌‌వన్ ప్లేస్‌‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం రిలీజ్‌‌ చేసిన తాజా జాబితాలో బుమ్రా 718 రేటింగ్‌‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి వన్డేలో కెరీర్‌‌ బెస్ట్‌‌ గణాంకాలు నమోదు చేయడం ఇండియన్‌‌ పేసర్‌‌ ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 2020 ఫిబ్రవరిలో బుమ్రా.. తన టాప్‌‌ ర్యాంక్‌‌ను కివీస్‌‌ పేసర్‌‌ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌కు కోల్పోయాడు. దాదాపు 730 రోజులు నంబర్‌‌వన్‌‌లో కొనసాగిన బుమ్రా.. ఇండియా తరఫున అత్యధిక కాలం ఆ ప్లేస్‌‌లో ఉన్న తొలి ప్లేయర్‌‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌గా తొమ్మిదో ప్లేయర్‌‌గా నిలిచాడు. అలాగే కపిల్‌‌ దేవ్‌‌ తర్వాత వన్డేల్లో నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ను సాధించిన ఇండియన్‌‌ తొలి ఫాస్ట్‌‌ బౌలర్‌‌గానూ బుమ్రా రికార్డులకెక్కాడు. తాజా జాబితాలో మహ్మద్‌‌ షమీ మూడు ప్లేస్‌‌లు ఎగబాకి 31వ ర్యాంక్‌‌ను దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌‌లో మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (803), కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (802) వరుసగా మూడు, నాలుగో ర్యాంక్‌‌లో ఉన్నారు. శిఖర్‌‌ ధవన్‌‌ 12వ ర్యాంక్‌‌ను సాధించాడు. టీ20 ర్యాంకింగ్స్‌‌లో సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (732) కెరీర్‌‌ బెస్ట్‌‌ ఐదో ర్యాంక్‌‌లో నిలిచాడు. బౌలింగ్‌‌లో భువనేశ్వర్‌‌ (658) ఎనిమిదో ర్యాంక్‌‌లో ఉన్నాడు. మరోవైపు వన్డే టీమ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో ఇండియా (108) థర్డ్‌‌ ప్లేస్‌‌,  టీ20ల్లో టాప్‌‌ ర్యాంక్‌‌లో కొనసాగుతున్నది.