నర్సరీల్లో ఆశలు చిగురిస్తున్నయ్

నర్సరీల్లో ఆశలు చిగురిస్తున్నయ్

తాజా వానలతో ఆర్డర్లు
కిచెన్, ఇండోర్ గార్డెనింగ్​పై కస్టమర్ల ఇంట్రెస్ట్
ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్​కు డిమాండ్
లాక్​డౌన్​తో రూ.లక్షల్లో నష్టపోయిన ఓనర్లు

హైదరాబాద్, వెలుగు : లాక్ ​డౌన్ ​తో డీలా పడ్డ నర్సరీ బిజినెస్​లో తాజా వానలు కొత్త ఆశలు నింపుతున్నాయి. కూలీల్లేక, మెయింటెనెన్స్​ కరువై నిర్వాహకులు లక్షల్లో నష్టపోయారు. మార్చి నుంచి ఆగిపోయిన వ్యాపారం వానాకాలంతో మళ్లీ మొదలవుతుందని ఓనర్లు చెప్తున్నారు. ఏపీలోని రాజమండ్రి, కడియంతోపాటు పుణె, మహారాష్ట్ర నుంచి కొత్తవి దిగుమతి చేసుకునే పనిలో పడ్డారు.

ఇండోర్ ప్లాంట్స్​కి గిరాకీ

సిటీలో వందల నర్సరీలున్నాయి. వాటిల్లో వివిధ రకాల పూల మొక్కలు, డెకరేషన్, ఎయిర్ ప్యూరీఫై ప్లాంట్స్, కిచెన్, టెర్రస్, ఇండోర్ గార్డెనింగ్ మొక్కలు, సంబంధిత సామగ్రి సెటప్స్​ ఉంటాయి. రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజన్​లో ప్రతి నర్సరీ రూ.5లక్షల నుంచి 7లక్షల బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. సమ్మర్​లో అందులో సగం ఉంటుంది. ఈసారి లాక్ డౌన్​తో బిజినెస్ బంద్​అయింది. ప్రస్తుతం ఇండోర్ ప్లాంట్స్​కి ఎక్కువగిరాకీ ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్​కి వర్క్ ఫ్రం హోమ్ ఉండడం, ఇంట్లో ఎక్కువసేపు స్టే చేస్తుండడం వల్ల ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఇండోర్ ప్లాంట్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు. క్రోరోఫితుమ్, సైగోనియమ్, పోథోస్, గోల్డెన్ పోథోస్, సాన్సెవియేరియా, ఫికస్, వేరియేటెడ్ పోథోస్, ఫిలోడెన్డ్రోన్, రబ్బర్ ప్లాంట్, జడే ప్లాంట్, అంతూరియమ్, ఓర్చిడ్, మూన్ కాక్టూస్, సక్యులెంట్స్ ప్లాంట్స్​కి ఆర్డర్లు వచ్చాయంటున్నారు.

వర్కర్స్ కొరత

నర్సరీల్లో పనిచేసే వర్కర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వాళ్లే. ఒక్కో చోట ముగ్గురి నుంచి 10 మంది దాకా పని చేస్తుంటారు. కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సగానికిపైగా సొంతూళ్లకు వెళ్లడంతో మొక్కలను చూసుకోవడం నిర్వాహకులకు కష్టంగా మారింది. డైలీ వాటర్ పట్టడం, సంరక్షణ చర్యలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వర్కర్స్ తిరిగి వస్తేనే మెయింటెనెన్స్ ఈజీ అవుతుందని చెప్తున్నారు.

కస్టమర్ల నుంచి ఎంక్వైరీ కాల్స్

లాక్ డౌన్​తో చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మళ్లీ బిజినెస్​ అవుతుందనే ఆశ ఉంది. రెగ్యులర్ క్లయింట్స్, కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి. కిచెన్, ఇండోర్ గార్డెనింగ్​కి ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయనుకుంటున్నాం.

– దివ్యాంజని, ప్లాన్ ఏ ప్లాంట్ నర్సరీ


కొత్త మొక్కలు తెస్తాం

లాక్ డౌన్ కారణంగా 2 లక్షల లాస్ వచ్చింది. చాలా మొక్కలు చనిపోయాయి. వానలు పడుతుండడంతో కొత్తవి తెచ్చేందుకు రెడీ అవుతున్నాం. తిరిగి బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుంజుకుంటుందనుకుంటున్నా.

– చందు, శ్రీ వెంకట సత్యదేవ నర్సరీ

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్