ఫ్యామిలీ న్యూస్ : ఆగస్ట్ 15.. మీ పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ ఐడియాలు ఇవే..

ఫ్యామిలీ న్యూస్ : ఆగస్ట్ 15.. మీ పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ ఐడియాలు ఇవే..

స్వాతంత్ర్య దినోత్సవం అంటే ముఖ్యంగా పిల్లలు అత్యంత ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్స్ డేల పేరుతో పాఠశాలల్లో డ్యాన్స్ పోగ్రామ్స్, స్పోర్ట్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్ అరెంజ్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పిల్లలు వివిధ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వేషాలను ప్రదర్శిస్తూ ఉంటారు. తమ డ్రెస్సింగ్ స్టైల్ తో వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. అయితే మరో కొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానుంది. కాబట్టి.. మీ పిల్లలకు ఈ సారి ఎలాంటి డ్రెస్సింగ్ అట్రాక్ట్ చేసేలా చూపించాలని అనుకుంటున్నట్టయితే.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత జెండా:

మీ పిల్లలను భారత జెండా పతాకాన్నిప్రతిబింబించేలా, ఆ రంగుల దుస్తులను ధరించేలా చేయండి. వారికి మూడు రంగుల (ఆకుపచ్చ, కాషాయం, తెలుపు) దుస్తులు లేదా కుర్తా-పైజామా సెట్‌ను తీసుకోండి. దీనిపై త్రివర్ణ దుపట్టా, వైట్ కలర్ (తెల్లటి) చప్పులను కూడా వేసి అలంకరించండి.

ఇండియన్ ఆర్మీ సోల్జర్:

మీ పిల్లలను భారత సైన్యంలోని ధైర్య సైనికుడిలా చూడాలనుకుంటున్నారా.. అయితే ఖాకీ ప్యాంటు లేదా షార్ట్స్‌తో టీ-షర్ట్ లేదా కుర్తాని ధరించేలా చూడండి. వారి రూపాన్ని ప్రతిబింబించేందుకు చేతిలో బొమ్మ తుపాకీ, ఆర్మీ క్యాప్ కూడా పెడితే ఇంకా అందంగా కనిపిస్తారు.

జానపద నృత్యానికి సంబంధించనవి:

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని మీ పిల్లల ద్వారా పిల్లల చూపించాలనుకున్నట్టయే రాజస్థానీ ఘాగ్రా-చోలీ లేదా పంజాబీ సల్వార్-కమీజ్ వంటి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పాపులర్ అయి జానపద కళల వారు ధరించే దుస్తులను పోలి ఉండేలా మీ పిల్లల డ్రెస్సింగ్ ను తయారు చేయించండి.

స్వాతంత్ర్య సమరయోధులు:

మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ వంటి భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా మీ పిల్లవాడిని చూడాలనుకుంటున్నట్టయితే.. వారు ధరించే వేషధారణతో మీ పిల్లల్ని రెడీ చేయండి. గాంధీ అయితే వారికి తెల్లటి ధోతీస, కుర్తా,.. సుభాష్ చంద్రబోస్ అయితే ఆర్మీ యూనిఫాం లేదా ప్యాంటుతో కూడిన ఖాకీ జాకెట్ ఇవ్వండి. ఇలా ఏ స్వాతంత్ర్య సమరయోధుల్లాగా కనిపించాలని కోరుకుంటే ఆ వ్యక్తుల వలె కనిపించేలా డ్రెస్సింగ్ ను ఎంచుకోండి.

విప్లవ నాయకులు:

మీ పిల్లవాడు భగత్ సింగ్ లేదా రాణి లక్ష్మీబాయి వంటి భారతీయ విప్లవ నాయకుడిలా కనిపించాలనుంటున్నారా.. అయితే భగత్ సింగ్ కోసం.. నల్లటి తలపాగాతో కూడిన సాదా తెల్లటి చొక్కా, నలుపు ప్యాంటు.. రాణి లక్ష్మీబాయికి సంప్రదాయ ఆభరణాలతో కూడిన చీరతో అలంకరించవచ్చు 

భారతీయ పురాణశాస్త్రం:

శ్రీకృష్ణుడు లేదా శివుడు వంటి భారతీయ పురాణాలలోని ఏదైనా పాత్ర వలె మీ పిల్లవాడిని చూడాలనుకుంటుంటే.. శ్రీకృష్ణుడి కోసం వేణువు, నెమలి ఈకతో కూడిన నీలిరంగు ధోతీ-కుర్తా సెట్‌ను తీసుకోవచ్చు. శివుని కోసం త్రిశూలం, మ్యాటెడ్ హెయిర్ విగ్‌తో కూడిన నీలిరంగు ధోతీ-కుర్తా సెట్‌ను ధరింపజేయవచ్చు.

కాబట్టి, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ పిల్లల్ని ఈ అద్భుతమైన ఫ్యాన్సీ దుస్తులలో చూసి ఆనందించండి. ఈ ప్రత్యేకమైన రోజును ఎప్పటికీ గుర్తుంచుకునేందుకు, ఆ క్షణాలను కెమెరాల్లో బంధించి మరింత ప్రత్యేకంగా జరుపుకోండి.