చనిపోయే ముందు.. పదేళ్ల పాపకు పెళ్లి చేశారు.. గుండెలు పిండేస్తున్న చివరి కథ

చనిపోయే ముందు.. పదేళ్ల పాపకు పెళ్లి చేశారు.. గుండెలు పిండేస్తున్న చివరి కథ

చనిపోయే ముందు.. పదేళ్ల పాపపెళ్లికథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. క్యాన్సర్ తో పోరాడుతున్న 10 యేళ్ల బాలిక  చివరి కోరికను తీర్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలిక మరణించే ముందు తల్లిదండ్రులను కోరిన చివరి కోరిక కోరగా.. ఆమె శాశ్వతంగా కన్నుమూసే లోపు చిన్ననాటి స్నేహితుడితో పెళ్లి చేశారు.  ఈ సంఘటన యూఎస్ లో జరిగింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

యూఎస్ కు చెందిన ఎమ్మా ఎడ్వర్డ్స్ చివరి కోరిక మేరకు డేనియల్ మార్షల్ క్రిష్టోఫర్ డీజే విలియమ్ తో ఆమె కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు.  ఎమ్మా.. అక్యూట్ లింఊఫోబ్లాస్టిక్ లుకేమియా క్యాన్సర్తో బాధపడుతోంది. చివరి దశలో ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన ఎమ్మా.. తన తల్లిదండ్రులను చివరి కోరిక కోరింది. చిన్ననాటి స్నేహితుడైన డేనియల్ తో వివాహం జరిపించాలని  కోరింది. దీంతో ఎమ్మా మరణించడానికి 12 రోజుల ముందు జూన్ 29న ఎమ్మా వెడ్స్ డేనియల్ మాక్ వెడ్డింగ్ జరిగింది.  

ఈ వేడుకను "మాక్ వెడ్డింగ్" అని పిలుస్తారు.. అమ్మాయి తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది. రెండు రోజుల్లోనే పెళ్లికి ప్లాన్ చేశారు. దాదాపు 100 మంది శ్రేయోభిలాషులు హాజరయ్యారని తెలిసింది. ‘‘చాలా మంది పిల్లలు డిస్నీల్యాండ్‌కి వెళ్లాలని కోరుకుంటారు, కానీ ఎమ్మా పెళ్లి చేసుకోవాలని..భార్య కావాలని..ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంది. అని ఎమ్మా తల్లి అలీనా నివేదికలలో పేర్కొంది.