- ఘనంగా వర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ వేడుకలు
హసన్ పర్తి, వెలుగు: ఫార్మసీ కాలేజీ అధ్యాపకుల సేవలు మేరువలేనివని కేయూ వీసీ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. వర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ వేడుకల ముగింపు సమావేశం హనుకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం జరిగాయి. వీసీ ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాలేజీ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని, తద్వారా వర్సిటీ కీర్తి ప్రతిష్టలను పెంచారని కొనియడారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ వర్సిటీ స్టూడెంట్ల కు క్యాంపస్ రిక్రూట్, ఇంటర్న్ షిప్ లు, ఇండస్ట్రియల్ విజిట్ కు ముందుకొచ్చినందుకు అభినందనలు తెలిపారు.
గోల్డెన్ జూబిలీ సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహమతులు, శాలువా, బొకే, మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, వి. మల్లారెడ్డి, వి. కిషన్, సాంబారెడ్డి, ఎన్. ప్రసాద్, జె. కృష్ణవేణి, గాదె సమ్మయ్య పాల్గొన్నారు.
