హైదరాబాద్ సిటీ, వెలుగు: యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మస్తీ (మ్యూజిక్, ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) కేంద్రం ఆదివారం బషీరాబాగ్లోని భారతీయ విద్యా భవన్లో రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఏఎస్టీఐ వ్యవస్థాపక సభ్యులు, ప్రోఆర్క్ సీఈఓ సంతోష్ కావేటి మాట్లాడుతూ ప్రస్తుతం 83 మంది పిల్లలు పియానో, కూచిపూడి, ఫ్రీ స్టైల్ డాన్స్, చిత్రకళ, కర్ణాటక సంగీతం వంటి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
