ఖానాపూర్ మండలంలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సర్పంచ్,ఉప సర్పంచ్లు

ఖానాపూర్ మండలంలో  కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సర్పంచ్,ఉప సర్పంచ్లు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ పెద్ది రాజు, వార్డు సభ్యులు హస్తం గూటికి చేరారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. వారికి బొజ్జు పటేల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజాపాలనతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధోనికేని దయానంద్, మాజీ కౌన్సిలర్ కిశోర్ నాయక్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.