ఇటిక్యాల, వెలుగు:- అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. కర్నూల్ నుంచి గద్వాల వైపు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఇటిక్యాల స్టేజి సమీపంలో పట్టుకొని డ్రైవర్లు శివకుమార్, నరసింహపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
కేటిదొడ్డి: ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బలిగేర నుంచి చింతలకుంటకు ఇసుక తీసుకెళ్తుండగా పట్టుకొని డ్రైవర్, ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
