బస్టాండ్ నిర్మాణంలో నాణ్యత లేదు : జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్

బస్టాండ్ నిర్మాణంలో నాణ్యత లేదు : జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్

మంగపేట, వెలుగు: న్యూ బస్టాండ్ పనులు నాసిరకంగా చేస్తున్నారని, నిర్మాణ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ములుగు జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండల క్రేందంలోని ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల పక్కన కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను ఆదివారం బీజేపీ మంగపేట బూత్ అధ్యక్షుడు ఎడ్లపెల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ బృందం పరిశీలించింది. 

ఈ సందర్భంగా లింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ. న్యూ బస్టాండ్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ప్రాంగణంతో పాటు రైతు సహకార సంఘం ఆఫీసు నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు నీళ్లు నిలిచాయన్నారు.

బస్టాండ్ వర్క్ నామ్స్ ను గాలికి వదిలారని, మొరంతో నింపాల్సిన బస్టాండ్ ప్రాంగణాన్ని పంట పొలాల మట్టితో నింపి కాంట్రాక్టర్ చేతులు దులుపుకొన్నరని మండిపడ్డారు. ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి బస్టాండ్​ను పరిశీలించిన సమయంలో నాసిరకం పనులపై దృష్టి సారించాలని, ప్రయాణ ప్రాంగణం ఎత్తు పెంచాలని ఆఫీసర్లకు సూచించినప్పటికీ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కౌన్సిల్ సభ్యులు చల్లా రామ్కి, నాయకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.