రాబోయే ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తాం : చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

రాబోయే ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తాం : చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట, వెలుగు: స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు  ప్రాధాన్యత ఇస్తామని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్యలు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  స్వర్గీయ, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి యూత్ కాంగ్రెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. ఆయన చూపిన బాటలోనే జిల్లాలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేలా పనిచేయాలని అన్నారు. అనంతరం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు సభ్యులుగా విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ నాయకులను సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జులు వేలిమినేటి సురేష్, రమ్య కృష్ణ, సునీల్ లతో కలిసి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రావ్య సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.