- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఉరేసిందని మెదక్ పార్లమెంట్కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు ఆరోపించారు. మహాత్మగాంధీ పేరుతోనే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆదివారం కాంగ్రెస్ ఆవిర్భవాన్ని పురస్కరించుకొని చిట్కుల్ జెండా ఆవిష్కరించారు. అనంతరం టీపీసీసీ పిలుపు మేరకు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్నేతృత్వంలో గాంధీ పేరుతో ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కేంద్రం 90శాతం, రాష్ర్ట ప్రభుత్వాలు 10 శాతం నిధులు సమకూర్చడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి లభించిందన్నారు.
పేద ప్రజల ఉపాధిని ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీన పరిచి కొత్త పేరుతో ప్రవేశపెట్టి పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్రవీందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు వెంకటేశ్, అజ్జు, అశోక్, గోపాల్, గౌరీశంకర్, అనిల్‌కుమార్, కరణ్, యాదయ్య, నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.
