హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ విస్తరణతో చెత్త సేకరణ, నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు సర్కిల్‌కు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పలు సర్కిల్స్ లో ఇప్పటికే కొంత మంది కొనసాగుతుండగా..ఇంకొంతమంది డీఈఈలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఇంజినీర్లు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని, సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
