కాటేదాన్ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

 కాటేదాన్ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం
  • దట్టమైన పొగతో  స్థానికులు ఉక్కిరిబిక్కరి 

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ జరిగి, మంటలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ ఇండస్ట్రియల్ పరిధిలోని శాస్త్రిపురం టాటానగర్ లో ఇండ్ల మధ్య శివానంద బ్రదర్స్ ప్లాస్టిక్స్ గ్రైన్ వర్క్ మానుఫ్యాక్చర్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఇక్కడి గోదాంలో షార్ట్​సర్క్యూట్​జరిగి, మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వెలుడటంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కంపెనీ నిర్వాహకులు పోలీసులకు, ఫైర్​స్టేషన్​కు సమాచారం అందించారు. ఫైర్​సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  

సోమాజిగూడలో పేలిన సిలిండర్.. 

పంజాగుట్ట: సోమాజిగూడ ఆల్​ఫైన్​ హైట్స్​లో ఆదివారం సాయంత్రం  గ్యాస్​సిలిండర్​పేలి, మంటలు చెలరేగాయి. 8 అంతస్థల మేడ కావడం, 5వ అంతస్థులోని తాళం వేసిన గదిలో నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.