హైదరాబాద్, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థల్లో స్పోర్ట్స్ ఉత్సవ్–2025 క్రీడా ఉత్సవం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్లోని అన్ని బ్రాంచీలలో వేలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 12 జోన్లుగా విడిపోయి అథ్లెటిక్స్, ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్, రీక్రియేషనల్ అంశాల్లో తమ ప్రతిభను చాటారు.
క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ వంటి విభాగాల్లో రాణించిన విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన, డైరెక్టర్లు శ్రీధర్, నాగేంద్ర హాజరయ్యారు.
