ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..మహబూబ్ నగర్ జిల్లా చిన్న ఆదిరాలలో ఘటన

ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..మహబూబ్ నగర్ జిల్లా చిన్న ఆదిరాలలో ఘటన

జడ్చర్ల, వెలుగు: ట్రాక్టర్​ను స్టార్ట్ చేసి కదిలిస్తుండగా బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన అల్లాపురం ఉమారాణి, ఆంజనేయులు దంపతులకు  కొడుకు, కూతురు ఉన్నారు. ఆదివారం పొలం వద్ద మక్కలు పట్టేందుకు ఆంజనేయులు తన ట్రాక్టర్​ను తీసేందుకు సిద్ధంగా చేశాడు. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజిన్ కు తాళం పెట్టి, డ్రైవర్ సీట్ లో కొడుకు మణిదీప్(5) ను కూర్చో బెట్టాడు. 

బాలుడు తాళంతో స్టార్ట్ చేయగా ట్రాక్టర్ ముందుకు కదిలి..  మణిదీప్ కిందపడ్డాడు.  అతనిపై నుంచి  ట్రాక్టర్ వెళ్లడంతో స్పాట్ లో చనిపోయాడు. బాలుడి మృతి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.