ఎబోలా ఎఫెక్ట్.. భారత్- ఆఫ్రికా సమ్మిట్ వాయిదా

ఎబోలా ఎఫెక్ట్..   భారత్- ఆఫ్రికా సమ్మిట్ వాయిదా
  • ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎబోలా అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆఫ్రికా నుంచి వచ్చేవారికి గైడ్​లైన్స్​

న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని కాంగో సహా పలు ప్రాంతా ల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈనెల 28 నుంచి ఢిల్లీలో జరగాల్సిన ‘4వ భారత్–ఆఫ్రికా ఫోరమ్ సమిట్’ వాయిదా పడింది. ఆఫ్రికాలో మారుతున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఇరుపక్షాల పరస్పర చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. త్వరలోనే సమిట్ కొత్త తేదీలను ఖరారు చేస్తామని తెలిపింది. ప్రస్తుతం కాంగోలో అరుదైన ‘బుందిబుగ్యో’ ఎబోలా వేరియంట్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. డబ్ల్యూహెచ్​వో లెక్కల ప్రకారం మే18 నాటికి కాంగో, ఉగాండాలో కలిపి 528 అనుమానిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 132 మంది మృతిచెందారు.

ఆఫ్రికా నుంచి వచ్చేవారికి అడ్వైజరీ

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రమత్తమైంది. ఎబోలా కేసులు నమోదవు తున్న కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచనలతో ఢిల్లీ ఎయిర్​పోర్ట్ అడ్వైజరీ విడుదల చేసింది. ఆయా దేశాల నుంచి వచ్చిన లేదా ఆ దేశాల గుండా ప్రయాణించిన వారు జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు నొప్పి, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన 21 రోజుల లోపు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తమ ప్రయాణ వివరాలు తెలియజేయాలని తెలిపింది. కాగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ  గురువారం ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అయితే, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.