ప్రణబ్ మృతికి దేశ వ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు: కేంద్రం

ప్రణబ్ మృతికి దేశ వ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు: కేంద్రం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. ప్రణబ్ అందించిన సేవల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రణబ్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణబ్ మృతితో రాష్ట్రపతి భవన్, ఇతర కార్యాలయాలపై ఉన్న జాతీయ పతాకాలను అవనతం చేశారు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స జరిపారు డాక్టర్లు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోగా…మరింత విషమించింది.దీనికి తోడు కరోనా సోకడంతో ప్రణబ్ కోలుకోలేక పోయారు. ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) తుది శ్వాస విడిచారు.