భారత్ మాకు కీలక భాగస్వామి: యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ

భారత్ మాకు కీలక భాగస్వామి: యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌లో యూఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ జేమ్స్ ఆస్టిన్‌‌తో జరిగిన చర్చలో రాజ్‌‌నాథ్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ మిలిటరీ, ఇండో-పసిఫిక్ కమాండ్, సెంటర్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ మధ్య సహకారం గురించి అమెరికా డిఫెన్స్ సెక్రటరీతో రివ్యూ జరిపామని తెలిపారు.

మిలటరీ విస్తరణ, డిఫెన్స్ కో-ఆపరేషన్, వసతుల కల్పన గురించి మీటింగ్‌‌లో చర్చించామని రాజ్‌నాథ్ చెప్పారు. ఆ తర్వాత యూఎస్ సెక్రటరీ జేమ్స్ ఆస్టిన్ మాట్లాడుతూ.. ఆటంకం లేని చట్టబద్ధమైన వాణిజ్యం విషయంలో భారత ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛనివ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌‌తో యూఎస్ సంబంధాలు మరింతగా బలపడితే ఇండో-పసిఫిక్ రీజియన్‌‌కు చాలా మంచిదన్నారు. ప్రాంతీయ భద్రత దృష్ట్యా ఇది కీలకమన్నారు. అంతర్జాతీయంగా తమకు భారత్ కీలక భాగస్వామిగా మారిందన్నారు.