భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న టితో పోల్చితే 4 వేల 171 కేసులు తగ్గినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కొత్తగా 3 లక్షల 33 వేల 533 కేసులు నమోదు కాగా..525 మంది  కరోనా కారణంగా మరణించారు. గడిచిన 24 గంటల్లో  2 లక్షల 59 వేల 168 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో పాజిటివిటీ రేటు 17.78శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 21 లక్షల 87 వేల 205 ఉన్నాయి. అయితే కేసులు మెల్లగా తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. 10వేలకుపైగా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటు వ్యాక్సినేషన్ కూడా కేంద్రం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 161 కోట్ల 92 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. 

తమిళనాడులో కొత్తగా 30 వేల 744 కేసులునమోదు కాగా.. 33 మంది మరణించారు.. ప్రస్తుతం అక్కడ లక్షా 94వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 42 వేల 470 కేసులు వచ్చాయి. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కర్ణాటకలో 3 లక్షల 30వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీరేటు 19.33శాతం ఉంది. గుజరాత్ లో 23 వేల 150 కేసులు నమోదు కాగా.. 15 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కొత్తగా 46 వేల 393 కేసులు నమోదు కాగా.. 48 మంది మరణించారు. అక్కడ యాక్టివ్ కేసులు 2 లక్షల 79 వేలకుపైగా ఉన్నాయి.. ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టినా.. మరణాలు భారీగా పెరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

నాలుగు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు

కేరళలో ఇవాళ కూడా 45వేలు దాటిన కేసులు