
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలం మరింతగా పెరగనుంది. ఎయిర్ ఫోర్స్ లోకి కొత్తగా 200 వరకూ ఫైటర్ జెట్స్ రానున్నాయి. వీటిల్లో దేశ, విదేశీ తయారీ యుద్ధ విమానాలు ఉన్నాయని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. HAL (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) తయారు చేసే 83 లైట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA) తేజస్ మార్క్ 1A విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందని తెలిపారు. ఈ విమానాల డిజైన్ పూర్తి అయ్యిందని.. ఏడాదికి 16 విమానాలు తయారవుతాయని ఆయన చెప్పారు.