అమెరికా, ఇరాన్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో... అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్, గ్యాస్ కొరతతో జనం ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో కూడా పెట్రోల్ కొరత ఉంటుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటికైతే అలంటి ఇబ్బంది రాలేదు కానీ... అక్కడక్కడా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే నిర్మల్ జిల్లా భైంసాలో ఒకే ఒక్క పెట్రోల్ బంకు తెరిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పట్టణంలో ఉన్న 5 బంకుల్లో ఒకే ఒక్క రిలయన్స్ బంకు తెరిచి ఉండటంతో వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కొంతమంది పెట్రోల్ లేక వాహనాలు ఎక్కడికక్కడ వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు వాహనదారులు.
ఒకవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు పెట్రోల్ కొరతతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని.. ప్రబుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భైంసా ప్రజలు.

