V6 News

సైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో... నాలుగు నెలల్లో రూ.64 లక్షల కల్తీ సరుకు సీజ్..

సైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో... నాలుగు నెలల్లో రూ.64 లక్షల కల్తీ సరుకు సీజ్..

హైదరాబాద్ ఫుడ్ కల్తీపై ఫోకస్ పెట్టారు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. స్వీట్స్ షాపులు, బేకరీలు, మాంసం దుకాణాలు.. దేనిని వదలకుండా నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ ఆహార కల్తీని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో  జనవరి 1 నుంచి ఏప్రిల్ 21 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా కల్తీ సరుకు సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. నాలుగు నెలల్లో రూ. 64 లక్షల కల్తీ సరుకు సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.

స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో 22 కేసులు నమోదు చేసి.. 28 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు అధికారులు. బేకరీలు, స్వీట్స్ షాపులు, ఆయిల్స్, మాంసం దుకాణాలు, ఐస్‌క్రీమ్ యూనిట్లు టార్గెట్ గా తనిఖీలు చేపట్టామని...గడువు ముగిసిన పదార్థాలు, నకిలీ కలర్స్ వినియోగం బయటపడిందని తెలిపారు అధికారులు.

FSSAI లైసెన్స్ లేకుండా అనేక యూనిట్లు నడుస్తున్నాయని...భారీ స్థాయిలో కల్తీ బయటపడిందని అన్నారు అధికారులు. ఈ తనిఖీల్లో 5 వేల లీటర్ల నూనె, 5వేల192 కిలోల ఆటా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అధికారులు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్రమ తయారీ యూనిట్లు కూడా భారీగా బయటపడ్డాయని.. ఈ తనిఖీల్లో మొత్తం 64 లక్షల విలువైన సామగ్రి సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.