V6 News

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో .. మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో .. మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇరు జట్లకు ఈ విజయం అత్యవసరం అయింది. లక్నో తన హోమ్ గ్రౌండ్‌లో తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తుంటే, రాజస్థాన్ మళ్ళీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఏకనా స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉండటంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. 

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత కొన్ని మ్యాచ్‌లు తమకు సవాలుగా మారాయని, ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్నో జట్టు ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులతో బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు. 

Also Read  :పంజాబ్ కింగ్స్కి భారీ షాక్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. నేను టాస్ ఓడిపోవాలని ముందే నా జట్టు సభ్యులతో చెప్పాను, టాస్ ఓడిపోయినందుకు నేను సంతోషంగా ఉన్నాను.. మేము గత మ్యాచ్‌లో బాగానే బ్యాటింగ్ చేశాం కానీ మధ్యలో కొన్ని లెక్కలు తప్పాయి.. 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం అని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా పాత జట్టుతోనే బరిలోకి దిగుతోందని పరాగ్ వెల్లడించాడు. 

తుది జట్లు: 
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్