ఇండియా Vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌: చెరో మ్యాచ్ సొంతం

ఇండియా Vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌: చెరో మ్యాచ్ సొంతం

భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు వరుణుడు అడ్డొచ్చినా సరే గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది సఫారీ టీమ్. చేతిలో 8 వికెట్లతో నాలుగో రోజు బరిలో దిగిన సౌతాఫ్రికా ముందు 122 పరుగుల లక్ష్యం ఉండింది. అయితే వర్షం కారణంగా ఈ రోజు తొలి రెండు సెషన్ల ఆట పూర్తిగా రద్దయింది. అయితే మూడో సెషన్‌ సమాయానికి వర్షం ఆగింది. దీంతో ఆట షురూ అయింది. కానీ కొద్ది సేపటికే డెస్సన్‌ (40) వికెట్ పడిపోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ డీన్ ఎల్గర్ (96), బవుమా (23) చివరి దాకా క్రీజులో నిలచి.. సఫారీల సత్తాను చాటారు. సొంత గడ్డపై తమ పట్టు నిలుపుకొని 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్నారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్టులు చెరో మ్యాచ్‌ను సొంతం చేసుకోవడంతో సిరీస్‌ టై అయింది. అయితే తొలి టెస్టులో విజయం సాధించి ఎలాగైనా సరే సఫారీ గడ్డపై వారికి వైట్ వాష్‌ వేసి.. చరిత్ర సృష్టించాలని అనుకున్న టీమిండియా ఆశలు అవిరయ్యాయి. అయితే జనవరి 11న జరిగే చివరి టెస్టులో విజయం సాధిస్తే టీమిండియా ఈ సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.

స్కోర్: 

టీమిండియా 

తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్

దక్షిణాఫ్రికా

తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్: 243/3