వెల్లింగ్టన్: ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్ తో జరిగిన 4వ టీ20లో భారత్ విజయం సాధించింది. డ్రాగా ముగిసిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది టీమిండియా. సూపర్ ఓవర్ లో 14 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ మరో బాల్ ఉండగానే గెలిచింది. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఇవాళ జరిగిన 4వ టీ20 మ్యాచ్ కూడా గెలిచి సత్తా చాటింది. డ్రాగా ముగిసిన మూడో టీ20లోనూ థ్రిల్లింగ్ విక్టరీతో గెలిచిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒకే సిరీస్ లో 2 టై మ్యాచ్ లు కావడం విశేషం.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. టీమిండియాలో మనీష్ పాండే(50 హాఫ్ సెంచరీ), రాహుల్(39) మాత్రమే రాణించగా మిగతా ప్లేయర్లు ఎక్కువ స్కోరు చేయలేకపోయారు.
తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్.. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. మొదట ఆచితూచి బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత స్కోర్ నెమ్మదించింది. దీంతో రన్ రేట్ పెరగడంతో బ్యాట్సమెన్లు ఒత్తడికి గురయ్యారు. టపటపా వికెట్లు కోల్పోయాయి. దీంతో చివరివరకు పోరాడినా కివీస్ కు మరో ఓటమి తప్పలేదు. దీంతో సొంతగడ్డపై మరోసారి ఘోరంగా ఫెయిల్ అయి పరువుపోగొట్టుకుంది కివీస్.
5 టీ20ల సిరీస్ లో భారత్ 4-0 తేడాతో లీగ్ లో ఉంది.
కివీస్ ప్లేయర్లలో మున్రో (64), సీఫెర్ట్(57) రన్స్ తో రాణించారు.
భారత్ బౌలర్లలో.. బుమ్రా, చాహాల్ చెరో వికెట్ తీయగా ఠాకూర్ 2 వికెట్లు తీశాడు.
5వ టీ20 ఫిబ్రవరి-2న జరగనుంది.
కివీస్ కు చుక్కలు చూపించిన భారత్
India win!
— ICC (@ICC) January 31, 2020
KL Rahul and Virat Kohli ensure yet more heartbreak for New Zealand.#NZvIND pic.twitter.com/Tedlk5Niak


