రూ.450 కే కరోనా టెస్ట్ కిట్ : అరగంటలో ఫలితాలు

రూ.450 కే కరోనా టెస్ట్ కిట్  : అరగంటలో ఫలితాలు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగి పోతుండడంతో ఐసీఎం ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇండియా టైమ్స్ కథనం ప్రకారం..కరోనా వైరస్ టెస్ట్ ల సంఖ్యను పెంచేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐసీఎం ఆర్  – ఎయిమ్స్ ఆధ్వర్యంలో సౌత్ కొరియాకు చెందిన  బయో డయాగ్నొస్టిక్ సంస్థ ద్వారా కరోనా వైరస్ టెస్ట్ కిట్ ను డెవలప్ చేయించారు. అతి తక్కువ ధరకే నాణ్యమైన కిట్ ను బయో డయోగ్నోస్టిక్స్ సంస్థ తయారు చేసింది. కిట్ లు అందుబాటులోకి రావడంతో దేశ వ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్లు మరియు ఆస్పత్రులలో యాంటీ జెన్ టెస్ట్ లు చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సిఫారసు చేసింది.  రూ.450 విలువ గల స్టాండర్డ్ క్యూ కోవిడ్ -19 ఎజ్ అనే కిట్ ద్వారా కరోనా టెస్ట్ లు చేయాలని, టెస్ట్ చేసిన అరగంటకే వైరస్ సోకిందా లేదా అని తెలుసుకోవచ్చని తెలిపింది.  

ఐసీఎంఆర్ సిఫార్స్ చేసిన కిట్ లతో కరోనా టెస్ట్ లు ఎక్కడా చేస్తారంటే

ఐసీఎంఆర్ సిఫార్స్ చేసిన విధంగా

– రాష్ట్రాల్లోని అన్ని కంటెమెంట్ జోన్లు

– అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు

– అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు

– అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్ కేర్ (నాబ్) లలో

– అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు, COVID-19 పరీక్షా ప్రయోగశాలలు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ లాబొరేటరీస్ (NABL)లలో టెస్ట్ లు చేసేలా ICMR  ఆమోదించింది.

ఎవరెవరికి టెస్ట్ లు చేస్తారంటే

ఆస్పత్రులు మరియు కంటైన్ మెంట్ జోన్లలో  యాంటిజెన్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించుకోవచ్చని ఐసీఎం ఆర్ తెలిపింది.    ఐసీఎంఆర్  సూచించిన విధంగా అన్నీ లక్షణాలున్న ఇన్ఫూ ఎంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ) రోగులకు కిట్లను ఉపయోగించాలని సూచించింది. కీమో థెరపీ మరియు మార్పిడి కోసం ఆసుపత్రిలో చేరి కరోనా లక్షణం లేని రోగులు మరియు  అనారోగ్యంతో 65 ఏళ్లు పై బడిన వారిని కూడా పరీక్షించాలని చెప్పింది.  కరోనా వైరస్ తో బాధపడుతున్న వారితో సంబంధాలున్న వ్యక్తులు, కంటైన్ మెంట్ జోన్లు, హాట్ స్పాట్ లలో నివసించే వారిని కూడా  యాంటిజెన్ టెస్టింగ్ కిట్‌తో పరీక్షించాలని చెప్పింది.