గ్లోబల్​ టాప్‌‌ 300లో మన యూనివర్శిటీల్లేవ్‌‌

గ్లోబల్​ టాప్‌‌ 300లో మన యూనివర్శిటీల్లేవ్‌‌
  • 2012 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి
  • టైమ్స్‌‌ హైయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ ర్యాంకింగ్స్‌‌ లిస్ట్‌‌ రిలీజ్‌‌

లండన్‌‌:  గ్లోబల్‌‌ ఎడ్యుకేషన్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్‌‌ జాబితాల్లో మన యూనివర్శిటీ ర్యాంకులు పెరిగినా ఈ ఏడాది… టాప్‌‌ 300  లిస్ట్‌‌లో మాత్రం ఒక్క ఇన్‌‌స్టిట్యూట్‌‌కి కూడా చోటు దక్కలేదు. దేశంలో టాప్‌‌ ర్యాంక్‌‌ యూనివర్శిటీగా ఉన్న బెంగళూరులో ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ ర్యాంక్‌‌ కూడా ఈ ఏడాది పడిపోయింది. ఇలా జరగడం 2012 తర్వాత ఇదే తొలిసారి.  ‘టైమ్స్‌‌ హైయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ వరల్డ్‌‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌‌’  రిలీజ్ చేసిన రిపోర్ట్‌‌లో  ఈవివరాలు వెల్లడయ్యాయి. గత ఏడాది టాప్‌‌ 300లో చోటు దక్కించుకున్న   ఐఐఎస్‌‌సీ ఈసారి 301-–-350 గ్రూప్‌‌లోకి పడిపోయింది.

ప్రపంచంలో టాప్‌‌ యూనివర్శిటీలు

  • ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్శిటీ
  • కాలిఫోర్నియా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ
  • కేంబ్రిడ్జ్‌‌
  • స్టాన్‌‌ఫోర్డ్‌‌
  • మసాచుసెట్స్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ (మిట్‌‌)

మనదేశంలో టాప్‌‌  ఇన్‌‌స్టిట్యూట్స్‌‌

  • ఐఐటీ రోపర్‌‌ : 301-350 గ్రూప్‌‌లో చోటు
  • ఐఐటీ ఇండోర్‌‌: 351- 400 ర్యాంక్‌‌ గ్రూప్‌‌
  • ఐఐటీ ముంబై, ఢిల్లీ, ఖరగ్‌‌పూర్‌‌ :401-500 ర్యాంక్‌‌ గ్రూప్‌‌

ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్‌‌ పెంచడం ద్వారా టాప్‌‌ యూనివర్శిటీలకు ఫారెన్‌‌  స్టూడెంట్స్‌‌ను ఎట్రాక్ట్‌‌ చేయాలన్నది  ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌ టార్గెట్‌‌ .  స్టాండర్డ్స్‌‌, అకడమిక్స్‌‌, రిసెర్చ్‌‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్లే  ర్యాంకులు మెరుగవుతాయి. అప్పుడే ప్రపంచస్థాయిలో గట్టిపోటీ ఇవ్వగలిగే స్థాయికి ఇండియన్‌‌ యూనివర్శిటీలు ఎదుగుతాయి

– టైమ్స్‌‌ హైయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌  ర్యాంకింగ్‌‌ ఎడిటర్‌‌ ఇల్లీ బోథ్‌‌వెల్‌‌