దేశంలో 64 % దాటిన క‌రోనా రిక‌వ‌రీ కేసుల సంఖ్య

దేశంలో 64 % దాటిన క‌రోనా రిక‌వ‌రీ కేసుల సంఖ్య

దేశంలో కరోనా మ‌ర‌ణాల‌రేటు 2.25% గా ఉంద‌ని, ఇది ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ‌గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.
ఇంటింటి స‌ర్వేలు, ర్యాపిడ్ క‌రోనా టెస్ట్ లు, క్లీనిక‌ల్ మేనేజ్ మెంట్ ప్ర‌కారం ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ మ‌ర‌ణాలు భార‌త్ లో న‌మోదవుతున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు.

కేంద్రం ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అన్నీ ర‌కాల చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు, మ‌ర‌ణాల రేటు త‌గ్గించేందుకు హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు క‌ష్ట‌ప‌డ్డార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.

కాబ‌ట్టే జూన్ నెల మధ్య మ‌ర‌ణాల రేటు 3.33 శాతం నుండి ఈ రోజు 2.25 శాతానికి తగ్గిన‌ట్లు చెప్పారు

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు టెస్టులు లు , ట్రీట్మెంట్, ట్రేసింగ్ వంటి అంశాల్లో దృష్టి సారించ‌డం వ‌ల్ల జూన్ నెల మధ్యలో క‌రోనా రిక‌వ‌రీ కేసుల సంఖ్య 53% నుండి మంగళవారం నాటికి 64% కంటే ఎక్కువగా ఉంద‌ని కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 35,176 మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో, మొత్తం రికవరీ 9,52,743 వద్ద ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.