ఇండియా గౌరవానికి భంగం కలగనివ్వం

ఇండియా గౌరవానికి భంగం కలగనివ్వం

డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ: టిబెట్ ఎదురుగా లడఖ్ సరిహద్దుల్లో వందలాది ఇండియా, చైనా సైనికులు ముఖాముఖిగా కేంద్రీకృతమై ఉన్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు, చైనాతో వివాదంపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఇండియా తన ఆత్మ గౌరవానికి ఎప్పుడూ ముప్పు వాటిల్లనివ్వదని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. పొరుగు దేశమైన చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని మరోసారి ఆయన పేర్కొన్నారు.

‘ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ గౌరవానికి, ప్రతిష్టకు ఎటువంటి భంగం కలగనివ్వం. సరిహద్దు దేశాలతో సంబంధాలు కొనసాగించే విషయంలో ఇండియా స్పష్టమైన వైఖరిని అనుసరిస్తోంది. ఇది కొత్త విధానం కాదు. కొన్ని సమయాల్లో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇది ఇంతకు ముందూ జరిగింది. ఉద్రిక్తతలు పెరగకుండా ఉండటానికి ఇండియా యత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు కొనసాగుతున్నాయి’ రాజ్ నాథ్ వివరించారు.