బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కోవ లక్ష్మి

బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కోవ లక్ష్మి

ఆసిఫాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు కార్యకర్తలే బలం అన్నారు. ఆత్రం సక్కు గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి గ్రామస్థాయిలో బలమైన కార్యకర్తలున్నారని, తమ అభ్యర్థి గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సింగల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి సలాం, భీమేశ్, రవి, సుగుణాకర్, అశోక్, బలరాం పాల్గొన్నారు.