మనం ఎక్కడికైనా ఊరు వెళ్లినప్పుడు లేదా ట్రిప్‌కు వెళ్లినప్పుడు, హోటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాక ఆధార్ కార్డు మర్చిపోయామని గుర్తొస్తే ఎంత కంగారు పడతామో అందరికీ తెలిసిందే. బ్యాగ్‌లన్నీ వెతికినా దొరకనప్పుడు వచ్చే ఆ టెన్షన్ అంతా ఇంతా కాదు. వీటన్నిటికీ చెక్ పెడుతూ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక అదిరిపోయే ఐడియా తీసుకొచ్చింది.
ఈరోజు (మార్చి 6, 2026న) UIDAI విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇకపై మీరు హోటల్‌లో దిగడానికి/ హోటల్‌లో రూం తీసుకోవడానికి ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీ స్మార్ట్‌ఫోన్ ఉంటే నిమిషాల్లో చెక్-ఇన్ చేయోచ్చు.
ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందంటే:
*హోటల్ రిసెప్షనిస్ట్ మీ ఐడీ కార్డు అడిగినప్పుడు, మీ ఫోన్‌లో ఉన్న అఫీషియల్ ఆధార్ యాప్ (mAdhaar) ఓపెన్ చేయాలి.
*యాప్‌లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక, మీ ఫోన్ కెమెరా ద్వారా ఫేస్ అథెంటికేషన్ చేయాలి. దీనివల్ల ఆ ఆధార్ కార్డు మీదేనని సిస్టమ్ కన్ఫర్మ్ చేస్తుంది.
*వెరిఫికేషన్ పూర్తికాగానే, యాప్ ఒక QR కోడ్ ని జనరేట్ చేస్తుంది.
*ఆ కోడ్‌ను హోటల్ రిసెప్షనిస్ట్ స్కాన్ చేస్తారు. అంతే ! మీ వివరాలన్నీ క్షణాల్లో వెరిఫై అవుతాయి. ఎలాంటి పేపర్ అవసరం లేకుండానే మీ చెక్-ఇన్ పూర్తవుతుంది.
దీనివల్ల ఉపయోగాలు ఏంటి:
*ఆధార్ కార్డు లేదా ఆధార్ జిరాక్స్ మీతో తీసుకెళ్లాల్సిన పనిలేదు.
*సాధారణంగా హోటళ్లలో ఆధార్ జిరాక్స్ ఇస్తుంటాం. కానీ హోటల్ వాళ్ళు దానిని దాచుతారో మనకు తెలియదు. కానీ ఈ కొత్త విధానంలో, హోటల్ యాజమాన్యానికి కేవలం అవసరమైన సమాచారం మాత్రమే అందుతుంది.
*మీ వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుంది.
*హోటల్ రిసెప్షన్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
అయితే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందే మీ ఫోన్‌లో ఆధార్ యాప్ సెటప్ చేసుకోవడం మంచిది. హోటల్ చేరుకున్నాక నెట్‌వర్క్ సమస్య ఉన్నా లేదా హడావిడిలో ఉన్నా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన ప్రయాణాలు మరింత ఈజీ ఆవుతున్నాయి. ఈ కొత్త డిజిటల్ ఆధార్ పద్ధతి ప్రయాణికులకు, హోటల్ నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుంది.
Hotel check-in made simpler with the Aadhaar App. Verify instantly and enjoy a smooth, paperless check-in experience.#Aadhaar #UIDAI #AadhaarApp #HotelCheckIn #Paperless #DigitalIdentity pic.twitter.com/mkqdEkJQvx
— Aadhaar (@UIDAI) March 6, 2026
