'వాషింగ్ మెషిన్ కా కాలా జాదూ' ఆప్​ వినూత్న ప్రచారం

'వాషింగ్ మెషిన్ కా కాలా జాదూ' ఆప్​ వినూత్న ప్రచారం

న్యూఢిల్లీ: 'వాషింగ్ మెషిన్ కా కాలా జాదూ' పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఢిల్లీలో వినూత్న రీతిలో ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలో నెలకొన్న పరిస్థితులను సామాన్యులకు వివరించేందుకే ఈ తరహాలో ప్రచారాన్ని ప్రారంభించామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆప్ ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. బీజేపీ వాదనల వెనుకున్న నిజాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజిత్ పవార్, అశోక్ చవాన్, హిమంత శర్మ వంటి వ్యక్తులను చేర్చుకోవడంపై ప్రతిపక్షాలు బీజేపీని తరచూ వాషింగ్ మెషిన్ అంటూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. బీజేపీ వాషింగ్ ​మెషిన్​ఎలా పనిచేస్తుందో వివరించారు. శారదా కుంభకోణంలో హిమంత బిశ్వ శర్మ ప్రమేయం ఉందని బీజేపీ 6 నెలలు ప్రచారం చేసింది.. అయితే, ఆ తర్వాత అతన్ని బీజేపీలో చేర్చుకుని వాషింగ్​మెషిన్ లో పాపాలన్నీ కడిగేసిందని ఎద్దేవా చేశారు.