హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ నిందితుడు ఖాజా వహాబుద్దీన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం (ఫిబ్రవరి 19) ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర తనిఖీల్లో భాగంగా ఈగల్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
నిందితుడిపై 2005 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 43 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం, దోపిడీ, స్నాచింగ్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు ఉన్నట్లు గుర్తింపు. అలాగే.. 4 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరిపాడు నిందితుడు.
ఒడిశాలో రూ.10 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.50 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2026, జనవరి 27 నుంచి ప్రత్యేక డ్రైవ్‌లో 225 మంది పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. ఈగల్ ఫోర్స్ పోలీసులు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.
