మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ తో ఉద్రిక్తతల నడుమ అమెరికా మిడిల్ ఈస్ట్ లో భారీ ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించింది. గత 20ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మిడిల్ ఈస్ట్ లో జెట్ ఫైటర్లు, యుద్ద నౌకలతో సహా రాడార్ కమాండ్ కంట్రోల్ విమానాలను తరలించడంతో ఇరాన్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. త్వరలో ఇరాన్ పై సైనిక చర్య తప్పదని ట్రంప్ సంకేతాలిచ్చిన తర్వాత ఇది జరిగింది.
2003లో ఇరాక్ పై దాడి తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఇటీవల అమెరికా తన వైమానిక శక్తిని భారీగా పెంచుకున్నట్లు అమెరికా మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా అత్యాధునిక F35, F22 వంటి జెట్ ఫైటర్లను మిడిల్ ఈస్ట్ కు తరలించింది. అంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ద నౌక అబ్రహాం లింకన్, ఆ తర్వాత ఇటీవల రెండో యుద్ద విమాన వాహన నౌక USS జెరాల్డ్ ను ఈ ప్రాంతానికి తరలించింది.
USS జెరాల్డ్ యుద్ద నౌకలో ఎలక్ట్రానిక్ యుద్ద విమానాలతోపాటు వైమానిక సమాచారానికి కీలకమసన కమాండ్ కంట్రోల్ విమానాలు కూడా ఇందులో ఉన్నాయి. మరోవైపు కీలకమైన క్షిపణులను కాపాడే రక్షణ వ్యవస్థను కూడా ఈ ప్రాంతంలో మోహరించింది అమెరికా.
అయితే ఇరాన్ పై దాడులకు చేయాలని ట్రంప్ ఆదేశిస్తారా లేదా, ఒకవేళ దాడి చేస్తే ట్రంప్ లక్ష్యం ఏమిటీ అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి దళాల మోహరింపు, ఖమేనీ పాలనపై ఇప్పటికే ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ యుద్దమే గనక ఎంచుకుంటే అణు కేంద్రాలు, ఇరాన్ ప్రభుత్వ నేతలను టార్గెట్ గా దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ రాజకీయ, సైనిక నేతల హతమార్చే ఉందని అమెరికా అధికారుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
కరెన్సీ పతనం, ద్రవ్యోల్బణం పెరగడంతో ఇరాన్‌లో నిరసనలు చెలరేగి ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత ఆ ఆందోళన ప్రభుత్వ వ్యతిరేక మలుపు తీసుకుంది. దీంతో ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం నిరసనకారులపై అణిచివేత, ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనిక చర్య తప్పదని బెదిరించారు. ఆ తర్వాత అమెరికా దృష్టి ఇరాన్ అణు నిల్వలపైకి మళ్లింది.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తున్న క్రమంలో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగి ఇరాన్ పై సైనిక చర్యకు సిద్దమవుతోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఇరాన్ చుట్టూ భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఇది కొన్ని వారాలాపాటు ఇరాన్ పై నిరంతరం యుద్దానికి సరిపోయే ఆయుధ సామాగ్రిని మిడిల్ ఈస్ట్ కు చేర్చింది. ఇది గతంలో ఇరాన్ పై దాడులకు భిన్నంగా ఉంటుందని, ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై ఒకేసారి అమెరికా దాడి చేసే అవకాశం ఉంది.
అయితే ఈ వారం జెనీవాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశమైన క్రమంలో ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు జరిపారు. అయితే ఇరాన్ పై దాడులు చేయాలా వద్దా అనేది ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. చర్చల్లో కొంచెం పురోగతి కనిపించింది.. అయితే చాలా విషయాల్లో రెండు వైపులా చర్చలు జరుగుతున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ చెప్పారు.
