రూ.70వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ సూపరింటెండెంట్

రూ.70వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ సూపరింటెండెంట్

హైదరాబాద్ లో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ విద్యాశాఖ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు దొరికారు. ఓ స్కూల్ కు ఎన్ వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్ లోని సైఫాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో పనిచేస్తున్న సూపరింటెండెట్  ఫణిరాజ్, సీనియర్ అసిస్టెంట్  శ్రీధర్ లు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన స్కూల్ కు సంబంధించి సీబీఎస్ఈ ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను సూపరింటెండెంట్ తో మాట్లాడి ఎన్ వోసీ ఇప్పిస్తానని తెలిపాడు. అయితే బాధితుడు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసిబి అధికారులను ఆశ్రయించారు. 

గురువారం వారు డిమాండ్ చేసిన రూ.70 వేలు సూపరింటెండెంట్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ తీసుకున్న సమయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఏసిబి అధికారులు తెలిపారు.