ఇన్ఫోసిస్‌‌ లాభం రూ.7,696 కోట్లు .. క్యూ 4 లో 30 శాతం అప్‌‌

ఇన్ఫోసిస్‌‌ లాభం రూ.7,696 కోట్లు .. క్యూ 4 లో 30 శాతం అప్‌‌

న్యూఢిల్లీ:  ఇన్ఫోసిస్  రెవెన్యూ  ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌ (క్యూ4) లో పెద్దగా పెరగకపోయినా, కంపెనీ నికర లాభం మాత్రం 30 శాతం (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో రూ.6,128 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన కంపెనీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో రూ.7,969 కోట్లు సాధించింది. రెవెన్యూ  రూ.37,441 కోట్ల నుంచి 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లకు చేరుకుంది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  రెవెన్యూ 1–3 శాతం పెరుగుతుందని  ఇన్ఫోసిస్ అంచనా వేస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరం మొత్తం పరిగణనలోకి తీసుకుంటే కంపెనీ నికర లాభం రూ. 26,233 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.24,095 కోట్లతో పోలిస్తే ఇది 8.9 శాతం గ్రోత్‌‌కు సమానం. రెవెన్యూ రూ.1,46,767 కోట్ల నుంచి 4.7 శాతం వృద్ధి చెంది రూ.1,53,670 కోట్లకు ఎగసింది. 2023–24 కు గాను షేరుకి రూ.20 ఫైనల్ డివిడెండ్‌‌ను, రూ.8  స్పెషల్ డివిడెండ్‌‌ను ఇన్ఫోసిస్ ప్రకటించింది.