ఫోర్బ్స్ లిస్టులో మన కంపెనీలు 17

ఫోర్బ్స్ లిస్టులో మన కంపెనీలు 17
  • టాప్ -3 లో ఇన్ఫోసిస్

ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ కంపెనీల జాబితాలో 17 ఇండియన్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. దీనిలో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌‌కు మూడో ర్యాంక్ లభించింది. తొలి ర్యాంక్ గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ వీసాకు, రెండో స్థానం ఇటాలియన్ కారు కంపెనీ ఫెరారీకి దక్కాయి. 2018లో 31వ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌‌ ఒక్కసారిగా మూడో స్థానానికి జంప్ చేసింది. 2019 లిస్ట్‌‌లో టాప్ 10లో నెట్‌‌ఫ్లిక్స్‌‌(4వ స్థానం), పేపాల్(5వ ర్యాంక్), మైక్రోసాఫ్ట్(6వ స్థానం), వాల్‌‌ డెస్నీ(7వ ర్యాంక్), టోయోటా మోటార్(8వ స్థానం), మాస్టర్ కార్డ్(9వ ర్యాంక్), కాస్ట్కో హోల్‌‌సేల్(10వ స్థానం)లో నిలిచాయి. ఫోర్బ్స్‌‌ లిస్ట్‌‌లో అత్యంత  ఉత్తమ కంపెనీలుగా చోటు దక్కించుకున్న ఇతర ఇండియన్ కంపెనీల్లో టాటాస్టీల్, ఎల్‌‌ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్‌‌డీఎఫ్‌‌సీ, బజాజ్ ఫిన్‌‌సర్వ్, పిరమల్ ఎంటర్‌‌‌‌ప్రైజస్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, సన్ ఫార్మా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్ ఉన్నాయి.