ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2020, మార్చి 29న ముంబైలోని వాఖండే స్టేడియంలో ప్రారంభం కానుంది. మే 24న ముగియనుంది. మొత్తం 57 రోజుల పాటు IPL క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. టోర్నీ ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కాబట్టి.. తొలి, ఫైనల్ మ్యాచ్ ముంబైలోనే జరగనున్నాయి. IPL మ్యాచ్‌ల షెడ్యూలు ఇంకా ఖరారు కానప్పటికీ ఫైనల్ మాత్రం మే 24న నిర్వహించనున్నారు. టోర్నీ మార్చి 29న ఆరంభమవుతుంది. రోజుకు ఒకే మ్యాచ్ నిర్వహించేందుకు ఇబ్బందేమీ ఉండదు. అయితే క్రికెట్ చూసేందుకు స్టేడియాలకు వచ్చిన వారు ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. దీనికి కారణం మ్యాచ్ ఆలస్యం కావడమే. దీనిపై చర్చలు ఇంకా జరుగుతున్నప్పటికీ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ఆరంభం కావొచ్చంటున్నారు క్రికెట్ నిపుణులు.

