న్యూక్లియర్ ఒప్పందానికి ఇరాన్ గుడ్ బై

న్యూక్లియర్ ఒప్పందానికి ఇరాన్ గుడ్ బై

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇరు దేశాల మధ్యాయుద్ధ వాతావరణం కనిపిస్తోంటే .. మరోవైపు యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచినట్టు ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన అంతర్జా తీయ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలు అమెరికాకు వ్యతిరేకంగా ఓ న్యూక్లి యర్ బాంబును ఇరాన్ తయారు చేస్తోందని లేదా మిలిటరీ ఎటాక్ ను ప్రారంభించనుందనే వాదనకు బలం చేకూ రుస్తున్నాయి. ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కి వెళ్లాలన్న ఆ దేశ పా ర్లమెంట్ నిర్ణయంపై ట్రంప్ మండిపడ్డారు. అదే పరిస్థితి వస్తే ఇరాక్ పై అతి భారీ ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆంక్షలు తప్పవు: ట్రంప్

ఇరాక్​ పై అతి భారీ ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ వార్నింగ్ ఇచ్చారు. బాగ్దాద్​లో డ్రోన్ ఎటాక్​తో ఇరాన్​ జనరల్​ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో యూఎస్ మిలీటరీ తమ దేశాన్ని విడిచివెళ్లాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానం చేయడంపై ట్రంప్​ మండిపడ్డారు. ఇస్లామిక్​ స్టేట్​ టెర్రరిస్టు గ్రూపుకు వ్యతిరేకంగా పోరాటం కోసం దాదాపు 5 వేల మంది అమెరికా సోల్జర్స్ ఇరాక్​ సేనలకు సహాయంగా ఆ దేశంలో ఉన్నారు. ‘‘ఇరాక్​లో మేము చాలా ఖర్చు చేశాం. బిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టి ఎయిర్​ బేస్​ను నిర్మించాం. మేము ఖర్చు చేసిన మొత్తం తిరిగి చెల్లించే వరకు ఇరాక్​ను విడిచిపెట్టేది లేదు”అని ట్రంప్​ స్పష్టం చేశారు. అయితే ఇరాక్​లో నిర్మించిన ఎయిర్​ బేస్​ పేరును మాత్రం ట్రంప్​ వెల్లడించలేదు. ‘‘ఒకవేళ మమ్మల్ని బలవంతంగా పంపించాలని చూస్తే అది స్నేహపూర్వక వాతావరణంలో జరగదు. గతంలో లేనటువంటి అతి భారీ ఆంక్షలు విధి స్తాం. ప్రస్తుతం ఇరాన్​పై ఉన్న ఆంక్షలను మించి ఉంటాయి”అని హెచ్చరించారు. ‘‘ఇరాక్​కు సంబంధించి తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. మిడిల్​ఈస్ట్​కు వెళ్లడం దేశ చరిత్రలో తీసుకున్న అతి పెద్ద తప్పు. ఈ విషయాన్ని నేను పబ్లిక్​గానే చెపుతున్నా”అని ట్రంప్​ అన్నారు.

న్యూక్లియర్​ డీల్​ నుంచి ఇరాన్​ ఔట్

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌‌‌‌‌‌‌‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని పక్కన పెడుతున్నట్లు ఇరాన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకున్నామని, తమ న్యూక్లియర్​ ప్రోగ్రామ్ పై ఎలాంటి పరిమితులు లేవని ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2015 నాటి అణు ఒప్పందం నుంచి పూర్తిగా బయట పడింది. ప్రస్తుతానికి విద్యుత్​ ఉత్పత్తి వంటి దేశ అవసరాల కోసమే అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. ఇంటర్నేషనల్​ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ)కి తమ సహకారం కొనసాగుతుందని ఇరాన్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేసింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంపై ఈ డీల్​లో భాగస్వామ్య దేశాలైన ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌, జర్మనీ, చైనా, బ్రిటన్‌‌‌‌‌‌‌‌ విచారం వ్యక్తం చేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ఫారిన్ మినిస్టర్​తో చర్చిస్తామని యునైటెడ్​ నేషన్స్​ తెలిపింది. మరోవైపు ఇరాక్​లో ఇస్లామిక్​ స్టేట్ గ్రూపు మళ్లీ యాక్టివ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మిడిల్​ఈస్ట్ ను ప్రమాదకరంగా, అస్థిర ప్రాంతంగా మార్చే సూచనలు ఉన్నాయి.