మహిళా ప్రయాణికులకు IRCTC రక్ష బంధన్‌ ఆఫర్

మహిళా ప్రయాణికులకు IRCTC రక్ష బంధన్‌ ఆఫర్

మహిళా ప్రయాణికులకు IRCTC రక్షా బంధన్ ఆఫర్ ప్రకటించింది. రక్ష బంధన్‌ను సందర్భంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే మహిళ ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనున్నట్లు తెలిపింది. ఆఫర్ కాలంలో తేజస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఛార్జీలలో తగ్గింపు ఇవ్వనుంది. ఇది క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి వారికి చేరుతుంది. IRCTC నిర్వహిస్తున్న రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తామని తెలిపింది. తేజస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మహిళా ప్రయాణీకులకు ఆగస్టు 24 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.  రక్షాబంధన్ పండుగ కోసం ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు ఆగస్టు 24 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుందని IRCTC తెలిపింది.

క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చిన సమయంలో చేసిన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సమయంలో మహిళలు చాలాసార్లు ప్రయాణించవచ్చు. ప్రతి క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసిన అదే ఖాతాకు ఛార్జీ డిస్కౌంట్ జమ చేయబడుతుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఆఫర్ ప్రారంభానికి ముందు ప్రయాణ వ్యవధి కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న మహిళా ప్రయాణీకులకు కూడా వర్తిస్తుంది.

ఇంతకుముందు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆగస్టు 7 నుండి రెండు ప్రైవేట్ ఆపరేటింగ్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను తిరిగి ప్రారంభించింది. ఇవి వారానికి నాలుగు రోజులు పనిచేస్తాయి. శుక్ర, శని, ఆదివారం, సోమవారం పని చేస్తుంది. రైలు నంబర్ 82901/82902 అహ్మదాబాద్-ముంబై-అహ్మదాబాద్ రైలు నంబర్ 82501/82502 లక్నో-న్యూఢిల్లీ-లక్నో వారానికి నాలుగు రోజులు సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో నడుస్తాయి.