పెయిన్ కిల్లర్..? బీరు..? నొప్పి తగ్గించడానికి ఏది మేలు

పెయిన్ కిల్లర్..? బీరు..? నొప్పి తగ్గించడానికి ఏది మేలు
  • పారాసెట్మాల్  టాబ్లెట్ కన్నా 25 శాతం మేలట!
  • లండన్ లోని గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం

తల నొప్పి, ఒళ్లు నొప్పులు.. లాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తాం.. డాక్టర్ దగ్గరకు వెళ్లడమో.. లేదా మెడికల్ షాపుకి వెళ్లి ఏదొక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకుంటాం! అంతే కదా.

కానీ, లండన్ కు చెందిన గ్రీన్ విచ్ యూనివర్సిటీ పరిశోధన షాకింగ్ విషయాలు బయటపెట్టింది. నొప్పి తగ్గడానికి పారాసెట్మాల్ లాంటి పెయిన్ కిల్లర్ వేసుకోవడం మేలా? బీరు తాగడం మేలా అన్నదానిపై అధ్యయనం చేసింది.

బీర్ లవర్స్ కు చల్లటి కబురు చెప్పింది ఆ స్డడీ. తలనొప్పి లేదా మరే నొప్పికైనా సరే పారాసెట్మాల్ కంటే రెండు గ్లాసుల బీరు ఫాస్ట్ గా పని చేస్తుందని ఆ పరిశోధన తెలిపింది. పారసెట్మాల్ తో పోలిస్తే బీర్ 25 శాతం బెటర్ రిలీఫ్ ఇస్తుందని చెప్పింది.

మోతాదు మించితే డేంజర్

గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకులు దాదాపు 400 మందిపై అధ్యయనం చేశారు. ఆల్కహాల్ ఒక మంచి అనల్జిసిక్ (పెయిన్ రిలీవర్ డ్రగ్) అని వారి స్టడీలో తేలిందట. ఇది క్లినికల్ గా కూడా ఫ్రూవ్ అయిందని చెబుతున్నారు పరిశోధకులు. నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఆల్కహాల్ వేగంగా పని చేస్తుందని చెప్పారు. అయితే మోతాదుకు మించి తీసుకుంటే దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని తెలిపారు.

బీరు ఎలా పని చేస్తుందంటే..

రెండు గ్లాసుల బీరు తాగితే.. మన రక్తంలో 0.08 శాతం ఆల్కహాల్ లెవల్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది నొప్పి తీవ్రతను తగ్గించి, దాన్ని తట్టుకునేలా శరీరాన్ని మలచగలదని చెప్పారు. పారాసెట్మాల్ వంటి కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల కన్నా ఇది వేగంగా పని చేస్తుందన్నారు.

నోట్: కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల కన్నా బీరు బాగా పని చేస్తుందని తమ అధ్యయనంలో పక్కాగా తేలిందని డాక్టర్ థాంప్సన్ తెలిపారు. అయితే బీరు వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, డాక్టర్ల సలహా ఫాలో అవడమే మేలని చెప్పారు.