వరల్డ్‌ టాప్‌-100 బిజినెస్ స్కూల్స్ జాబితాలో ISB

వరల్డ్‌ టాప్‌-100 బిజినెస్ స్కూల్స్ జాబితాలో ISB

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలోని వంద అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ జబితాలో చోటు దక్కించుకున్న భారతీయ బిజినెస్‌ స్కూల్‌లు అహ్మాదాబాద్‌, బెంగళూరులోని IIMలు మాత్రమే.  ప్రపంచంలోని IIM, ISBల్లో ప్రమాణాల ఆధారంగా ‘క్యూఎస్‌ గ్లోబల్‌ ఫుల్‌టైం ఎంబీఏ ర్యాంకింగ్స్‌ -2020’ తాజాగా విడుదల చేసిన జాబితాలో ISB 98వ స్థానంలో నిలిచింది.

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM) 40వ ప్లేస్ లో ఉంది. దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్‌ స్కూల్స్‌లో అహ్మదాబాద్‌ IIMది మొదటి స్థానం. బెంగళూరులోని IIM (IIM-B) 44వ స్థానంలో నిలిచింది.