స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...

స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే  ఏం జరుగుతుందో తెలుసా...

జ్యోతిష్యం ప్రకారం.. కలలు భవిష్యత్ సంఘటనలను సూచిస్తాయి. ప్రతి కల దాని ప్రయోజనాలను కలిగి ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా కొన్ని కలలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని పండితులు చెపుతుంటారు. .నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికి ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని కలలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.. మరికొన్ని కలలు మనల్ని ఎక్కువ భయపెడతాయి. ఇప్పుడు  కలలు వాటి అర్ధాలను తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది.  మీ జీవితంలో చాలా విషయాలు కలలకు సంబంధించినవి. తద్వారా అదృష్టాన్ని ఇచ్చే కలల గురించి తెలుసుకోవచ్చు.

మామిడి పండు: మీ కలలో మామిడిపండు కనిపిస్తే, అది అదృష్టమని చెబుతారు. మీరు జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు దాని నుండి కోలుకొని మంచి ఫలితాలను పొందుతారని దీని అర్థం. అదే సమయంలో మామిడి మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మామిడి పండు కనిపిస్తే జీవితంలో పురోగతి సాధిస్తారు.

 ఈత కొడుతున్నట్లు వస్తే: మీకు కలలో నీరు కనిపిస్తే, మీరు నది లేదా చెరువులో ఈత కొట్టాలని కలలుగన్నట్లయితే అది శుభప్రదమని చెపుతారు. ఈ కల శ్రేయస్సు మరియు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కలలో వర్షం కనిపిస్తే డబ్బు వస్తుందని అర్థం. మీకు లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు. 

తామర పువ్వు కనిపిస్తే.. మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల వస్తే మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని అర్థం అంట. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నెరవేరనుంది. ఈ కల బలమైన ఆర్థిక స్థితిని కూడా సూచిస్తుంది.

కలలో వేణువు ( Flute)  కనిపిస్తే:  మీరు వేణువు వాయిస్తుంటే అది శుభ సూచకం. ఇలాంటి కల కంటే మీ దంపతుల మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుందంటే. అంతేకాకుండా రిలేషన్‌షిప్‌లో ఉన్న అపార్థాలు కూడా పరిష్కారం అవుతాయంట.

 స్వప్న శాస్త్రం ప్రకారం.. మతపరమైన ప్రయాణం గురించి కలలు కనడం కూడా శుభప్రదమని చెపుతారు. అంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఏదైనా దేవాలయానికి వెళ్లినట్లు, లేదా ప్లాన్ చేసుకున్నట్లు కల కంటే.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని అర్ధమని స్వప్నశాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు.