తెలంగాణ పోలీస్ రికార్డ్... ఏడాదిలో 30 వేల ఫోన్లు రికవరీ

తెలంగాణ  పోలీస్ రికార్డ్... ఏడాదిలో  30 వేల ఫోన్లు రికవరీ

ఫోన్ల రికవరీలో  తెలంగాణ పోలీస్ శాఖ రికార్డ్ సృష్టించింది. చోరీకి గురైన, మిస్సైయిన  సెల్ ఫోన్  రికవరీలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.  ఏడాదిలో  30 వేల ఫోన్లు రికవరీ చేసి కర్ణాటక తర్వాతి స్థానంలో  నిలిచింది.   CEIR  పోర్టల్ తో  పాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా  సెల్ ఫోన్  రికవరీ జరిగిందని అడిషనల్ డీఐజీ మహేష్  భగవత్ తెలిపారు. 

దేశంలో ఫోన్ రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని మహేష్ భగవత్ అన్నారు. 2023 ఏప్రిల్‌ 19  నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు తెలిపారు.హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078,రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేశామన్నారు.సెల్ ఫోన్ చోరీకి గరైనప్పుడు లేదా కనిపించకుండా పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.  సిఈఐఆర్ పోర్టల్ లో  ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని చెప్పారు.