ఎండాకాలంలో మామిడిపండ్లు తినిని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను జపాన్ రైతులు పండిస్తున్నారు. మామూలుగా అయితే మన దగ్గర మామిడి పండ్లకు కిలో ధర రూ.80 నుంచి 120 దాకా ఉంటుంది. కానీ మనదేశంలోని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సంకల్ప్ విహార్ అనే రైతు తన పొలంలో విలువైన మియాజాకీ అనే జపాన్ మామిడి వెరైటీని పెంచుతున్నాడు. ఈ మామిడి కిలో ధర రూ.2.7 లక్షలు ఉంటుంది. ఒక్కో మామిడి పండు 400 గ్రాముల బరువు పెరుగుతుంది.
ఈ పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ మామిడిపండ్లను సూర్యుడి గుడ్లు అంటారు. ఇక సంకల్ప్ విహార్ తోటలో గతంలో దొంగలు పడి మియాజాకీ మామిడి పండ్లను ఎత్తుకుపోయారు. దీంతో తోటను కాపాడుకోవటానికి11 విదేశీ, 3 స్వదేశీ జాతులకు చెందిన ఆరు కుక్కలు, నలుగురు సెక్యూరిటీ గార్డ్స్, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాడు.
