
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సీని సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి, ప్రజాకవి అందెశ్రీ. మే 21 2024 మంగళవారం రోజున సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించారు. బుద్ధుడి విగ్రాహాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేంద రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.