కెమికల్స్​తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....

కెమికల్స్​తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....

Chemicals On Mango Fruits : వేసవి రాగానే మెుదట గుర్తొచ్చేది.. మామిడి పండు... పండ్లలో రారాజు.. తింటే.. టేస్టీ టేస్టీగా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికిన మామిడి పండ్లు సహజంగా పండినవేనా? వాటికి రసాయనాలు పూస్తే ఎలా గుర్తించాలి?

మార్కెట్లో లభించే పండ్లలో కాల్షియం కార్బైడ్ వాడిన పండ్లను ఎలా గుర్తించాలని డౌట్ అందరికీ వస్తుంది. కొన్ని లక్షణాలను బట్టి వీటిని గుర్తించవచ్చు. కాల్షియం కార్బైడ్ వాడిన మామిడి పండ్లపై బ్లాక్ స్పాట్స్ ఏర్పడతాయి. మీరు తెచ్చిన మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో వేయండి. ఆ మామిడి పండ్లు నీటిలో మునిగితే.. రసాయన రహిత పండ్లుగా చెప్పుకోవచ్చు. అదే మామిడి బకెట్ నీళ్లలో తేలితే దానికి ఏదో ఒక పొడి పూసినట్టుగా గుర్తించాలి. మామిడి పండు పొడితో పండేలా చేస్తే.. చూడటానికి మాత్రమే ఆకర్షణీయంగా ఉంటుంది. సహజంగా పండినప్పుడు ఇచ్చే రుచి ఉండదు.

మామిడి పండుకు కెమికల్ పౌడర్(Chemical Powder) చల్లితే.. దాని మెుదలు చూస్తే ఆ భాగం పండదు. అలాగే, దానిపై ఆకుపచ్చ, పసుపు పాచెస్ కనిపిస్తాయి. అదే సహజంగా పండిన మామిడి పైభాగంలోని పసుపు పచ్చ రంగు అతుకులుగా కాకుండా ఏకరీతిగా ఉంటుంది. రసాయన పొడితో పండిన మామిడి పండ్లలో రసం ఉండదు, రసం చాలా తక్కువగా ఉంటుంది.

అలాగే పండ్ల ఆకృతి, రంగును బట్టి కూడా ఈ తేడాను తెలుసుకునే వీలుంది.మామిడి పండ్లను, మిగతా పండ్లతో పోల్చి చూస్తే కలర్ టెక్ఛర్ ఎలా ఉందో గుర్తించే అవకాశం ఉంది. అలాగే కాల్షియం కార్బైడ్ వాడిన పండ్ల సువాసన కాస్త వేరుగా ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు.ప్రజలు మామిడి పండ్లను కొనుగోలు చేసే సమయంలో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. నమ్మకస్తులైన వ్యాపారుల వద్ద కొనుగోలు చేయడం మంచిది. అలాగే బాగా కడిగిన తర్వాతే వాటిని తినాలి.పండ్లను మగ్గబెట్టడానికి కాల్షియం కార్బైడ్ పౌడర్‌ వాడొద్దని ‘ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (FSSAI) హెచ్చరించింది.

వేసవిలో మామిడికాయల ధరలు ఎక్కువగా ఉంటాయి. అయినా తినాలని అనిపిస్తుంది. సహజంగా పండినవి తింటే ఆరోగ్యానికి మంచిది. మామిడి పండు(Mango Fruit) వాసన ముక్కుకు తగిలితే చాలు.. మామిడి పండు తినాలనే కోరిక కలుగుతుంది. మామిడి కాయలు ఇప్పటికే మార్కెట్‌లోకి రావడం ప్రారంభమైంది. అయితే మామిడి పండ్లను కోయడానికి ముందు రసాయనాలు కలిపారో లేదో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మామిడి పండు పండేందుకు కెమికల్స్(Chemicals) ఉపయోగిస్తారు. వాటిని కనుక్కొంటే మంచిది.

కృత్రిమంగా పండిన మామిడి పండ్లను ఎందుకు తినకూడదు?

కృత్రిమంగా పండిన మామిడి పండ్ల(Mango Fruit)ను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పండ్లు పొట్ట ఆరోగ్యంపై(Stomach Health) చెడు ప్రభావం చూపుతాయి. రసాయనాలు కలిగిన ఆహార పదార్థాలు క్యాన్సర్(Cancer) వంటి మహమ్మారి వ్యాధులకు కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం, మామిడి పండ్లను పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం నరాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల తలనొప్పి(Headche), అలసట, అధిక నిద్రపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అలసట, నరాల సమస్యలు వంటి సమస్యలు వస్తాయి.

ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. మార్కెట్లో పండ్లను కొనుగోలు చేసినప్పుడు.. రసాయనాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సీజనల్ పండ్లను వీలైనంత ఎక్కువగా తినాలి. అయితే కెమికల్స్ కలిస్తే.. మాత్రం అస్సలు తినకండి లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. రసాయనాలు ఉండే పండ్లను తీసుకోవడం వల్ల పార్కిన్సన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, పాలిచ్చే తల్లి ఇలాంటి పండును తింటే అందులోని రసాయనాలు పిల్లలకు హానికరం. FSSAI (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహార ఉత్పత్తులలో కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించింది.

కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టడానికి నిషేధిత కాల్షియం కార్బైడ్ కెమికల్‌ వాడటాన్ని FSSAI తీవ్రంగా పరిగణించింది. ఈ రసాయనంతో మగ్గబెట్టిన పండ్లను తింటే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, దీన్ని వాడొద్దని ట్రేడర్లకు వార్నింగ్ ఇచ్చింది. కాల్షియం కార్బైడ్ వాడకంపై ఉన్న నిషేధాన్ని తప్పక పాటించాలని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, ఫ్రూట్ ట్రేడర్లు, హ్యాండ్లర్లకు స్పష్టం పేర్కొంది. దీనికి బదులు, పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టడానికి ఇథైలిన్ గ్యాస్‌ వాడేందుకు అనుమతి ఇచ్చింది. 100ppm వరకు గాఢత కలిగిన ఇథైలిన్ గ్యాస్‌ను మగ్గబెట్టేందుకు వాడొచ్చని తెలిపింది.

సమ్మర్ వచ్చిందంటే చాలు.. మనకు కొన్ని రకాల పండ్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో మార్కెట్లకు వచ్చే మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. సాధారణంగా కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లతో పోలిస్తే సహజంగా పండినవి చాలా రుచిగా ఉంటాయి. అయితే సమ్మర్ సీజన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు మామిడి పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టి అమ్ముతారు. ఇందుకోసం కాల్షియం కార్బైడ్ అనే కెమికల్‌ వాడతారు. దీనిపై నిషేధం ఉన్నా, పండ్ల వ్యాపారులు వాడుతూనే ఉంటారు. తాజాగా ఈ కెమికల్ వినియోగంపై సెంట్రల్ ఫుడ్ రెగ్యులేటరీ బోర్డు సీరియస్ అయింది. పండ్లను మగ్గబెట్టడానికి కాల్షియం కార్బైడ్ పౌడర్‌ వాడొద్దని ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది.