హైదరాబాద్‌లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్

హైదరాబాద్‌లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో  మంగళవారం ఉదయాన్నే ఆరు చోట్ల దాడులు చేశారు. సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంటితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై ఏకకాలంలో రైడ్స్ చేసిన ఏసీబీ అధికారులు.  సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఉమామహేశ్వర్ రావు విచారణ అధికారిగా ఉన్నారు. 

సెబర్ క్రైం డిపార్ట్ మెంట్ డిటెక్టీవ్ మూడవ టీమ్ లో ఏసీపీగా ఉమ మహేశ్వర్ రావు పని చేస్తున్నారు. అశోక్ నగర్‌లోని ఏసీపీ ఉమామహేశ్వర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.